పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా నేడు లాంఛనంగా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే.
సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది.
సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినోదియ సితం’కి ఇది తెలుగు రీమేక్.
పేరుకే సముద్రఖని దర్శకుడు.. నిజానికి, తెరవెనుక అసలు కథ నడిపించేది
త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కథలోని మెయిన్ పాయింట్ తీసుకుని, మొత్తంగా సినిమాని త్రివిక్రమ్ మార్చేశాడట.
ఒరిజినల్‌కీ తెలుగు వెర్షన్‌కీ అస్సలు పోలిక వుండదనేది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
‘భీమ్లానాయక్’ సినిమా విషయంలోనూ చాలా మార్పులు చేశారు. అవి తెరపై బాగా వర్కవుట్ అయ్యాయి కూడా.
అయినా, మహేష్‌తో సినిమా చేస్తూ, త్రివిక్రమ్‌కి ఇంత ఖాళీ సమయం ఎలా దొరుకుతోందబ్బా.?