సాధారణంగా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడుతూ పనులు చేసి నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని భావిస్తారు.
అయితే కొందరు ఎంత సంపాదించిన డబ్బు చేతికి అందిన ఆ డబ్బు మాత్రం చేతిలో నిలబడదు.
ఏదో ఒక అవసరం నిమిత్తం ఖర్చు అవుతూ ఉండటం వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.
ఇలా చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇలా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవారు లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండి
చేతిలో డబ్బు నిలవాలి అంటే తప్పనిసరిగా ఈ ఐదు పనులు చేస్తే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయని చెప్పాలి.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా ఇంటి ఆవరణంలో తులసి మొక్క ఉండడం ఎంతో శుభసూచకం
తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కనుక అలాంటి లక్ష్మీ స్వరూపిని అయినటువంటి తులసి మొక్క ఇంటి ఆవరణంలో ఉండడం ఎంతో మంచిది.
అలాగే నిత్యం మన పూజ గదిలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.
ఇక ప్రతి గురువారం ఉపవాసం ఉండటం వల్ల అమ్మవారి అనుగ్రహం మన పైనే ఉంటుంది. ఇక మన ఇంట్లో పూజ గదిలో చిన్న సైజు శివలింగం ప్రతిష్టించి
ప్రతిరోజు జలాభిషేకం చేసిన తర్వాత కాస్త బెల్లం నైవేద్యంగా సమర్పించాలి ఎలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.
ఇక పౌర్ణమి రోజు తప్పనిసరిగా చంద్రుడికి పూజించడం వల్ల మనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేతిలో డబ్బు నిల్వ ఉంటుంది.