SSMB 28 టైటిల్.. క్లారిటీ వచ్చేది అప్పుడే

 మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న మూడవ సినిమా టైటిల్ ఏమిటి అనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

 మహేష్ బాబు కెరీర్లో ఈ సినిమా కూడా చాలా ముఖ్యం కానుంది. రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా కంటే ముందుగా రాబోతున్న సినిమా కాబట్టి..

 అందులోనూ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న మూడవ సినిమా కావున బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేస్తుంది.

 ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఏమిటి అనే విషయంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది లేదు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే

 ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ త్వరలోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అసలైతే ఈపాటికి సగానికి పైగా సినిమా షూటింగ్ కూడా పూర్తి కావాలి.

 కానీ అనేక కారణాల వలన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే.

 ఇక సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో అర్జునుడు అనే టైటిల్ ఫైనల్ కాబోతున్నట్లు గతంలో ఒక టాక్ వినిపించింది. ఇక ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే ఉగాది వరకు ఎదురు చూడాల్సిందే.

 ఉగాది పండుగ సమయంలో సినిమాకు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేయాలి అని దర్శకుడు నిర్మాత ఇటీవల డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

 ఇప్పటికే టైటిల్ విషయంలో రెండు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఫైనల్ చేసి ఉగాది టీజర్ తో పాటు టైటిల్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు.

 మరి ఆ టైటిల్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే ప్రధాన కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. థమన్ సంగీతం అందిస్తున్నారు.