ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అవార్డు ఏదైనా ఉంది అంటే అది ఆస్కార్ కాగా ఈ అవార్డు మన ఇండియన్ సినిమాకి గాని ఆస్కార్ కి ముందు “RRR” కి అదిరే ప్లానింగ్.!
ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ కి గాని ఎప్పుడు నుంచో ఓ అందని ద్రాక్ష. అయితే తమిళ్ నుంచి మొట్ట మొదటిసారిగా ఏ ఆర్ రెహమాన్ ఈ ప్రఖ్యాత అవార్డును అందుకొని
చరిత్ర సృష్టించగా అయితే తాను బాలీవుడ్ సినిమాకి చేసిన వర్క్ కి గాను ఈ అవార్డు వరించింది.
మరి ఇప్పుడు మన తెలుగు సినిమాకి గాను సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి వంతు వచ్చింది.
రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ ల ఆర్ ఆర్ ఆర్ సినిమా నాటు నాటు సాంగ్ కి గాను అకాడమీ అవార్డ్స్ లో నామినేట్ కాగా ఆల్ మోస్ట్ ఈ అవార్డు వచ్చేసినట్టే అని అంతా ఆసక్తిగా ఉన్నారు.
అయితే ఈ ఒక్క సాంగ్ మాత్రమే కాకుండా సినిమా కూడా వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ని ఎంతగానో అలరించింది. మరి అకాడమీ అవార్డ్స్ మార్చ్ లో అనౌన్స్ కానుండగా
ఆల్రెడీ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఈవెంట్ ఆహ్వానం మేరకు హాజరు అయ్యేందుకు అక్కడికి పయనం అయ్యాడు.
ఇక ఇదిలా ఉండగా ఈ అవార్డ్స్ కి ముందు అయితే అమెరికా ఆర్ ఆర్ ఆర్ సినిమా మరో సారి భారీ ఎత్తున రీ రిలీజ్ కి రెడీ అయ్యింది.
అక్కడ ఈసారి ఏకంగా 200 థియేటర్స్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. ఈ మార్చ్ 3 న నార్త్ అమెరికా లో గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా
ఇప్పుడు అనౌన్స్ చేయగా ఈ ప్లానింగ్ డెఫినెట్ గా ఆస్కార్ ముందు మరింత బజ్ అందుకోడానికి వర్క్ అవుతుందని సినీ వర్గాలు చెప్తున్నాయి.
మరి ఈ క్రేజీ ప్లానింగ్ అయితే ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాల్సిందే.