చింత గింజలతో ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటే మనలో చాలామంది నమ్మకపోవచ్చు.
కానీ ఇది నిజం చింత గింజల్లో ఉన్న ఔషధ గుణాలు డయాబెటిస్,రక్త పోటు,కీళ్ల నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలను సహజ పద్ధతిలో నియంత్రిస్తుంది.
మీరు చేయవలసిందల్లా చింత గింజలను సేకరించి శుభ్రపరచుకోవాలి తర్వాత వీటన్నిటిని దోరగా వేయించుకొని
వేడి చల్లారిన తర్వాత పొడిగా గ్రైండ్ చేసుకొని గాజు జార్ లో నిల్వ చేసుకోవాలి.ఇలా నిల్వ ఉంచుకున్న చింత గింజల పొడిని
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గోరువెచ్చని నీళ్ల లేదా పాలల్లో కలుపుకొని సేవిస్తే కొన్నాలకు ఫలితం మీకే తెలుస్తుంది.
ప్రతిరోజు చింత గింజల పొడిని ఉదయాన్నే పాలల్లో కలుపుకొని సేవిస్తే చింత గింజల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు
సీజనల్‌గా వచ్చే అన్ని ఇన్ఫెక్షన్లను అలర్జీలను నియంత్రించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
చింత గింజల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్,యాంటీ క్యాన్సర్ గుణాలు మన శరీరంలో ప్రమాదకర క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది
ముఖ్యంగా ఉదర క్యాన్సర్,పెద్ద ప్రేగు క్యాన్సర్లను అదుపు చేయడంలో ఎంతో ప్రభావంతంగా పనిచేస్తాయి.
తరచూ కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు చింత గింజల పొడిని పాలల్లో కలిపి సేవిస్తే కీళ్ల కదలికలకు ఉపయోగపడే ద్రవం ఉత్పత్తి అయ్యి కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం
లభిస్తుంది.డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు పాలల్లో చింత గింజల పొడిని కలుపుకొని సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్ సి,
శక్తివంతమైన ఆక్సిడెంట్లు మరియు పీచు పదార్థం రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.
రక్తనాళాల్లో అడ్డుగా ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి రక్తపోటు, గుండె పోటు ప్రమాదాలను తగ్గిస్తుంది.
మలబద్దకం గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.