ఈ మహాశివరాత్రి కానుకగా టాలీవుడ్ సినిమా దగ్గర మంచి అంచనాలు నడుమ వచ్చిన చిత్రాల్లో మేకర్స్ నుంచి గట్టి నమ్మకంతో వచ్చిన సినిమా “సార్” కూడా ఒకటి.
తమిళ వెర్సటైల్ హీరో ధనుష్ నటించిన ఈ సినిమా తోనే ధనుష్ డైరెక్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
అలాగే దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా తమిళ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ధనుష్ కెరీర్ లో మరో పెద్ద హిట్ దిశగా ఇప్పుడు వెళ్తుంది.
అయితే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 6 రోజుల రన్ ని ఈ సినిమా కంప్లీట్ చేసుకోగా తెలుగులో అయితే ధనుష్ కెరీర్ లోనే బెస్ట్ వసూళ్లు ఈ సినిమాకి వచ్చాయి.
మరి తెలుగులో అయితే ఈ సినిమా ఆరు రోజుల్లోనే 21 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా 11.6 కోట్లకి పైగా షేర్ ని అందుకుందట.
దీనితో ఈ చిత్రం అయితే ఇప్పుడు డిస్ట్రిబూస్టర్స్ డబుల్ ప్రాఫిట్స్ ని అందించినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ వారు అంటున్నారు.
అలాగే తమిళ్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లే రిజిస్టర్ చేస్తున్నట్టుగా సినిమా వర్గాలు చెప్తున్నాయి.
కాగా ఈ సినిమాలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా సుమంత్, సముద్రఖని తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో అయితే నటించారు.
అలాగే త్రివిక్రమ్ మరియు యంగ్ నిర్మాత నాగవంశీ లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మాణం వహించారు.