మన హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పూర్వకాలం నుండి ఈ ఆధునిక కాలంలో కూడా ప్రజలు వాస్తు శాస్త్రం పట్ల ఎంతో నమ్మకం కలిగి ఉన్నారు.
ఇంటిని నిర్మించేటప్పుడు, అలాగే ఇంట్లో ఉన్న వస్తువులు అమర్చడానికి కూడా పాస్టర్ నియమాలను పాటిస్తూ ఉంటారు.
వాస్తు నియమాలను అనుసరిస్తూ ఇంటిని నిర్మించడం వల్ల ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు. ఒకవేళ వాస్తు దోషాలకు విరుద్ధంగా ఇంటిని నిర్మించి
ఇంట్లో ఉన్న వస్తువులను అమర్చినట్లయితే అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా వాస్తు దోషం వల్ల ఆర్థిక సమస్యలు అధికమవుతాయి.
అయితే వాస్తు దోషం తొలగించి ఆర్థిక సమస్యలను దూరం చేయటానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ జాగ్రత్తలు పాటించటం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవ్వటమే కాకుండా
లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరిసంపదలు వచ్చి చేరుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో లక్ష్మీదేవి ఉన్న ఒక వెండి నాణెన్ని ని ఒక గాజు బౌల్ లో వేసి ఉంచండి.
ప్రతిరోజు ఈ నీటిని శుభ్రం చేసి అందులో కొన్ని పువ్వులు వేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది.
అలానే ఇంట్లో ఈశాన్యం వైపున లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలని ఉంచి ప్రతిరోజు వాటికి పూజ చేయటం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
అలాగే ఇంటికి ఉత్తరం వైపు తులసి మొక్కని ఉంచి పూజించటం వల్ల కూడా మంచిది.
ఇది కూడా ఆర్ధిక ఇబ్బందుల్ని తొలగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం నీలం రంగు పిరమిడ్ ని ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బు కి లోటు ఉండదు.
అలానే ఈశాన్యం వైపున మీరు మనీ ప్లాంట్ ను ఉంచడం కూడా మంచిది.
ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే ఇబ్బందుల నుండి బయటపడొచ్చు ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండొచ్చు.