టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న జెనరేషన్ లో ఎంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చినా కూడా ఓ హీరోయిన్ క్రేజ్ ని కానీ మార్కెట్ ని గాని దెబ్బ కొట్టలేరు.
ఆ హీరోయిన్ నే అనుష్క శెట్టి. బాహుబలి 2 తో పాన్ ఇండియా వైడ్ గా ఎంతో పాపులర్ అయ్యినప్పటికీ ఎన్నో భారీ ఆఫర్స్ ను తాను వదిలేసుకొని నార్మల్ సినిమాలే చేసింది.
వాటిలో భాగమతి భారీ హిట్ కాగా దాని తర్వాత చేసిన సినిమా నిశ్శబ్దం ప్లాప్ అయ్యింది. అయితే ఇప్పుడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేస్తున్న స్వీటీ
ఇప్పుడు ఓ షాకింగ్ లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచింది. గతంలో తన సైజ్ జీరో కోసం భారీ గా బరువు పెరిగిన అనుష్క
ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో కనిపించడం ఫ్యాన్స్ లో ఒక్కసారిగా షాకింగ్ గా మారింది.
దీనితో ఈమె లుక్ కోసం సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో చర్చ గా మారగా అసలు అనుష్క ఎందుకు ఇలా మారింది అనేది ఇప్పుడు తెలుస్తుంది.
అయితే అనుష్క నార్మల్ గానే తన బరువు పెరుగగా తాను ప్రస్తుతం కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుందట
అందుకే మళ్ళీ తన పాత లుక్ లోకి రావడం సాధ్యపడట్లేదు అని తెలుస్తుంది.
దీనితో తన హెల్త్ సెట్ అయ్యాక మళ్ళీ తన లుక్ ని మార్చుకుంటుంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి.
అయితే ఈ ఫోటోలు చూసిన వారి అందరికి మొదట ఎడిటింగ్ అనుకున్నారు కానీ కొన్ని వీడియో విజువల్స్ కూడా చూసాక
అనుష్క నిజంగానే మారిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నారు.