ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మాత్రమే కాకుండా వరల్డ్ సినిమా దగ్గర కూడా మారుమోగుతూనే ఉన్న సినిమా పేరు ట్రిపుల్ ఆర్(RRR).
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మాసివ్ మల్టీ స్టారర్ సినిమా వసూళ్ల పరంగా జపాన్ దేశంలో అయితే మైండ్ బ్లాకింగ్ రన్ ని కొనసాగిస్తోంది.
మరి అక్కడ ఈ సినిమా గత అక్టోబర్ లో నెలలో రిలీజ్ అయ్యి మన దగ్గర మాదిరి 100 కి పైగా సెంటర్స్ లో సెన్సేషనల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.
అంతే కాకుండా అక్కడ ఈ సినిమా భారీ మొత్తంలో వసూళ్లు అందుకొని ఇండియా నుంచి ఆల్ టైం రికార్డు గా నిలిచింది.
కాగా ఈ సినిమా అయితే అక్కడ నెక్స్ట్ లెవెల్ లో రన్ ని ఇంకా కొనసాగిస్తోంది.ఇక ఇప్పుడు అయితే జపాన్ లో
ఈ చిత్రం 946.2 మిలియన్ యిన్స్ ని రాబట్టిందట. దీనితో ఈ సినిమా స్యూర్ షాట్ గా ఎలా లేదన్న 1 బిలియన్ జపాన్ యిన్స్ అందుకుంటుంది
అని ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు. దీనితో ఈ చిత్రం మన ఇండియన్ కరెన్సీ లోకి మారిస్తే 60 కోట్ల భారీ గ్రాస్ ని ఈ సినిమా రాబట్టిందట.
మొత్తానికి అయితే జపాన్ లో ఈ సినిమా హవా ఇప్పుడప్పుడే ఆగేలా లేదని చెప్పుకోవాలి.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మెయిన్ లీడ్ లో నటించగా
ఆలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ లు ఫీమేల్ లీడ్ గా నటించారు.
అలాగే ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా తన నాటు నాటు ఆస్కార్ బరిలో ఎంపిక అయ్యింది.