సహజ పద్ధతిలో కళ్ళ చుట్టూ ఏర్పడే నల్లని వలయాలను తగ్గించుకోవడం ఎలాగో తెలుసా?

 చాలామందిలో కళ్ళ కింద ఏర్పడే నల్లని వలయాలు, ముడతలు ముఖ సౌందర్యానికి అడ్డంకిగా మారుతుంటాయి.

 కంటి కింద చర్మం పొడి వారి నల్లగా కమిలినట్లు కనిపించడానికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే తీవ్ర మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్య,

 అర్ధరాత్రి వరకు స్మార్ట్ ఫోన్ వినియోగించడం, హార్మోన్ల అసంతుల్యం, చర్మ సంబంధిత అలర్జీలు వంటివి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు ఈ సమస్య నుంచి బయటపడడానికి

 విచ్చలవిడిగా మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్షన్ ను వినియోగిస్తే సున్నితమైన చర్మం సహజ గుణాన్ని కోల్పోతుంది.

 కళ్ళ చుట్టూ ఏర్పడే నల్లని వలయాలను సహజ పద్ధతిలో తొలగించుకోవాలంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కాను పాటిస్తే సరిపోతుంది.

 ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పుదీనా ఆకులు, పావు కప్పు ఫ్రెష్ లెమన్ పీల్, నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

 ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వడగట్టి రసాన్ని మాత్రమే తీసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.

 ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వడగట్టి రసాన్ని మాత్రమే తీసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.

 ఒక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే సహజ సిద్ధమైన పేస్ క్రీమ్ రెడీ అవుతుంది. ఈ క్రీమ్ జార్లో వేసుకొని ఫ్రిజ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు.

 ఇలా తయారు చేసుకున్న సహజసిద్ధమైన పేస్ క్రీమ్ ను ఉదయం స్నానం చేయడానికి గంట ముందు కళ్ళ చుట్టూ మృదువుగా మర్దన చేసుకుని

 గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే కొన్ని వారాల్లోనే కంటి చుట్టూ ఉన్న నల్ల వలయాలు సహజ పద్ధతిలో తొలగిపోతాయి. మరియు కంటి కింద ఏర్పడే ముడతలు కూడా తగ్గుతాయి.

 ఈ క్రీమ్ వినియోగించడం ఉదయం పూట సాధ్యం కాకపోతే రాత్రి పడుకునే ముందు కంటి చుట్టూ సున్నితంగా మర్దన చేసుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.