ఇండియాలో బిగ్గెస్ట్ దర్శకుల్లో శంకర్ ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే… దేశవ్యాప్తంగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం శంకర్..
అటు రామ్ చరణ్ తో ఆర్సీ 15, మరోవైపు కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఆయన మరో ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.
ఇండియాలో మోస్ట్ క్రేజీయేస్ట్ యాక్టర్స్ లో తమిళ హీరో విజయ్, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఉంటారు. ఇక వీరిద్దరి కాంబో ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది. నిజమేనండీ..
వీరిద్దరితో డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ సినిమా తీయబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా అంతా అండర్ వాటర్ లో నడిచే సైన్స్ ఫిక్షన్ ఫిలిం అని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా బడ్జెట్ 900 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. అయితే ఇంత డబ్బు పెట్టడానికి రెండు పెద్ద ప్రోడక్షన్ హౌస్ లు నిర్మించనున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.
ఇక వీరిద్దరి కాంబో సినిమా వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో సినిమా ఉంటుందని అనుకుంటున్నారు.
ఇక ఈ ఏడాది ఈ హీరోలు మంచి హిట్ అందుకున్నారు. హీరో విజయ్ ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా తీయకపోయినా… ఆ రేంజ్ స్థాయి ఉంది. సంక్రాంతికి వారసుడుగా వచ్చాడు.
ఈ సినిమ బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు, తమిళ్ భాషల్లో మంచి వసూళ్లనే సాధించింది. తన నెక్ట్స్ సినిమాను లోకేశ్ కనగరాజ్ తో తీయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు.
ఇటీవల విడుదలైన లియో టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విక్రమ్, ఖైదీ సినిమాలకు కనెక్షన్ ఉంటుందని తెలుస్తోంది.
ఇక బాలీవుడ్ కు సరైనా హిట్ లేక అల్లాడిపోతున్న టైంలో పఠాన్ గా షారుక్ వచ్చి.. కోట్లు కొల్లగొడుతున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు.
ఇప్పుడు ఈ హీరోలు కలిసి.. శంకర్ దర్శకత్వంలో.. భారీ బడ్జెట్ మూవీ తీస్తే.. వరల్డ్ షేక్ అవ్వడం ఖాయమని అంటున్నారు.