ఈ నెలాఖరున ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం.. మార్చి 20 లోపల సెట్స్ మీదకు వెళ్ళనున్న సినిమా..
ఇదీ యంగ్ టైగర్ ఎన్టీయార్ తన తదుపరి సినిమా గురించి ఇటీవల ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా బయటపెట్టిన అప్డేట్.
అసలు కథ ఎక్కడిదాకా వచ్చింది.? అంటే, క్లారిటీ లేదు. ఎప్పుడో ప్రారంభమవ్వాల్సిన సినిమా ఇది. వాయిదా పడుతూ.. పడుతూ వచ్చింది.
అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో, ‘మమ’ అనిపించేయడానికి ఓ ప్రారంభోత్సవమైతే చేయబోతున్నారు.
ఇదిలా వుంటే, ఈ సినిమాకి పాన్ ఇండియా లుక్ తెచ్చే క్రమంలో ఓ తమిళ నటుడ్నీ, ఓ కన్నడ నటుడ్నీ,
ఓ బాలీవుడ్ నటుడ్ని కూడా తీసుకొస్తున్నారట. వాళ్ళెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
ముగ్గురు ప్రముఖ నటుల్ని మూడు భాషల నుంచి తీసుకొస్తే అది పాన్ ఇండియా సినిమా అవుతుందా.?
అన్నదీ డౌటే. మరి, మలయాళం నుంచి ఎవరొస్తారబ్బా.? ఇది ఇంకో డౌట్. దర్శకుడు కొరటాల అయితే తీవ్ర ఒత్తిడిలో వున్నాడట.
స్టార్స్‌ని తీసుకుంటే సరిపోదు.. కథలో ఆయా పాత్రల్ని లింక్ చేయడం ముఖ్యం మరి.!