సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కొన్నాళ్ళ క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయిన సాయిధరమ్ తేజ్, మృత్యువుతో పోరాడి విజయం సాధించాడు. ప్రాణాలతో బయటపడ్డాడు.
తిరిగి సినిమాల్లో నటించడానికి చాలా టైమ్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్, ఇప్పుడిప్పుడే పబ్లిక్ అప్పీయరెన్స్ ఇస్తున్నాడు.
కానీ, సాయి ధరమ్ తేజ్‌లో ఇంకా ఆనాటి రోడ్డు ప్రమాదానికి సంబంధించిన భయం అలాగే వుండిపోయినట్లు కనిపిస్తోంది.
భయం సంగతి పక్కన పెడితే, మాట చాలా ఎక్కువగా తడబడుతోంది. మరి, సినిమాల్లో డైలాగులు ఎలా చెబుతాడు.? అసలు యాక్షన్ సీన్స్ ఎలా చేస్తాడు.?
ఈ డౌట్స్ చాలామందిలో వున్నాయ్. ఓ సినిమా అయితే సైన్ చేశాడు.. అది షూటింగ్ జరుగుతోంది.. దాదాపు పూర్తయిపోయిందని అంటున్నారు కూడా.
దాంట్లో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రధారి.
ఇంతకీ, సాయిధరమ్ తేజ్ డైలాగులు ఎలా వుండబోతున్నాయ్.? ఆయన గొంతు పరిస్థితేంటి.?