‘అబ్బే, నాకు రాజకీయాలు పడవు’ అంటాడుగానీ, రాజకీయాల్లో వేలు గట్టిగా పెట్టేస్తుంటాడు.
ఒక్కమాటలో చెప్పాలంటే, రాజకీయాల్లో అయినా.. సినిమాల్లో అయినా.. రామ్ గోపాల్ వర్మ అంటే పెయిడ్ ఆర్టిస్ట్.. అనే ప్రచారమైతే వుంది.
తెలుగుదేశం పార్టీ అంటే గిట్టదు.. జనసేన పార్టీ అన్నా గిట్టదు రామ్ గోపాల్ వర్మకి. కారణం ఏంటి.. అన్నది వేరే చర్చ.
వైసీపీ సానుభూతిపరుడిగా రామ్ గోపాల్ వర్మకి వున్న ప్రత్యేకమైన గుర్తింపు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
గులాబీ పార్టీ మీద కూడా అడపా దడపా వలపు బాణాల్ని ట్వీట్ల రూపంలో వదులుతుంటాడు ఆర్జీవీ.
అసలు విషయమేంటంటే, రామ్ గోపాల్ వర్మ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడట. ప్రస్తుతానికైతే తెరవెనుక రాజకీయం చేస్తున్న రామ్ గోపాల్ వర్మ, నేరుగా ఏదన్నా పార్టీతో లింకు వుంటే..
ఇంకాస్త రెచ్చిపోవచ్చని అనుకుంటున్నాడట. ఆయన నేరుగా వైసీపీలోనే చేరతారన్నది ఓ ప్రచారం.
ఇందులో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే.. రాజకీయాల్లోకి వెళ్ళాక వర్మ చేయడానికేమీ వుండదు. బయట వుంటేనే.. ‘పెయిడ్ ఆర్టిస్ట్’ అనే గుర్తింపు అయినా కొనసాగుతుంది.
ఆయన మాటలు కొంతమందికి రుచిస్తాయ్. రాజకీయాల్లో అలా వుండదు. ఆ విషయం రామ్ గోపాల్ వర్మకీ తెలుసు. కానీ, రామ్ గోపాల్ వర్మ..
రాజకీయాల గురించి ఆలోచన చేస్తున్నాడట. తెరవెనుకాల ఎవరో ఆయన్ని బలవంతంగా రాజకీయాల్లోకి లాగేయాలని చూస్తు్నారట కూడా.!