ఎన్ఎండీసీ లిమిటెడ్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వాళ్లకు అదిరిపోయే తీపికబురును అందించింది.
మొత్తం 42 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.
డిపార్ట్మెంటల్/ ఎక్స్టర్నల్ అభ్యర్థుల నుంచి ఈ సంస్థ దరఖాస్తులను సేకరిస్తుండటం గమనార్హం.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.
https://www.nmdc.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా ఫైనాన్స్ & అకౌంట్స్ విభాగంతో పాటు మెటీరియల్స్ & పర్చేజ్, పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుందని తెలుస్తోంది.
ఫిబ్రవరి 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉందని సమాచారం.
32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఉద్యోగాలను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉంటాయని తెలుస్తోంది.
బీఈ, బీటెక్, పీజీ డిప్లొమా చదివిన వాళ్లతో పాటు బ్యాచిలర్ డిగ్రీ, సీఏ (ఇంటర్)/ ఐసీడబ్ల్యూఏ- సీఎంఏ (ఇంటర్) చదివిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.
భారీ వేతనం ఆఫర్ చేస్తుండటంతో ఈ ఉద్యోగాలకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే ఛాన్స్ ఉంది.
భారీ వేతనం ఆఫర్ చేస్తుండటంతో ఈ ఉద్యోగాలకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే ఛాన్స్ ఉంది.
ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. కొన్ని ప్రముఖ సంస్థలు తక్కువ సంఖ్యలోనే ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తున్నాయి.
ఈ ఉద్యోగాలకు మరో పది రోజుల గడువు మాత్రమే ఉండటంతో వేగంగా దరఖాస్తు చేసుకుంటే మంచిది.