సాధారణంగా మనం ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు లేదా ఏదైనా పనిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు వాష్ రూమ్ లేదా టాయిలెట్ కి వెళ్లడం సర్వసాధారణం
అందుకే మనకు ప్రయాణ మార్గాలలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వాలు వాష్ రూం లను ఏర్పాటు చేస్తున్నాయి.
అయితే కొన్ని ఆటలలో మాత్రం ఒక్కసారి మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత ప్లేయర్స్ రూల్స్ బ్రేక్ చేయకుండా అవుట్ అయిన తర్వాత మాత్రమే మైదానం వదిలి బయటకు వెళ్లాల్సి ఉంటుంది
అయితే ఇలాంటి సమయంలో వారికి టాయిలెట్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏం చేస్తారు రూల్స్ ప్రకారం వెళ్లవచ్చా లేకపోతే వారి పరిస్థితి ఏంటి అనే విషయానికి వస్తే….
సాధారణంగా క్రికెట్ లేదా ఇతర ఆటలు ఆడుతున్న సమయంలో మైదానంలో ప్లేయర్స్ అందరూ కూడా నిమగ్నమై ఉంటారు
అయితే కొన్నిసార్లు అనుకోకుండా ఆటగాళ్లకు దాహం కావడం లేదా వాష్ రూమ్ కి వెళ్లాల్సిన పరిస్థితిలో ఏర్పడటం జరుగుతుంది. ఇలాంటి సమయంలో రూల్స్ లో తప్పనిసరిగా సడలింపు ఉంటుంది.
ఎక్కువ సమయం పాటు మైదానంలో ఆట ఆడుతూ తొందరగా డిహైడ్రేషన్ అవుతారు అందుకే మధ్యలో డ్రింక్ బ్రేక్ తప్పనిసరిగా ఉంటుంది.
ఈ క్రమంలోనే ఆటకాలకు వాష్ రూమ్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే తమ స్థానంలో ఇతర ఆటగాలను నియమించి వాళ్లు వాష్ రూమ్ వెళ్ళవచ్చు.
ఈ విషయంలో ఆటగాళ్లకు సడలింపు ఉంటుంది.ఇక చాలామంది బ్యాటింగ్ చేయడానికి వచ్చేముందు వాష్ రూమ్ వంటి అవసరాలను కంప్లీట్ చేసుకుని మైదానంలోకి దిగుతారు.
అయితే ఇలా ఆట మధ్యలో ప్లేయర్స్ టాయిలెట్ వెళ్లాల్సి వస్తే వెళ్లడానికి ఏ విధమైనటువంటి ఆంక్షలు ఉండవు.