వచ్చే వారంలో ప్రేమికుల దినోత్సవం రానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రేమికుల వారోత్సవాలు మొదలయ్యాయి
ఈ క్రమంలోనే నిన్న రోజ్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవాలని నేడు ప్రపోస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే చాలామంది
ఇతర వ్యక్తులను ప్రేమించి వారిలో ఉన్నటువంటి ప్రేమను బయటకు వ్యక్తపరచలేక పోతారు.
ఈ విధంగా ప్రేమించినప్పటికీ తమ ప్రేమను బయటకు చెప్పలేని వారు ఈ సింపుల్ చిట్కాలను పాటించి వాలెంటైన్స్ డే లోపు మీరు ప్రేమించిన వ్యక్తులకు ప్రపోజ్ చేయండి.
స్టోరీ ద్వారా ప్రపోజ్ చేయడం:మీరు ప్రేమించిన వ్యక్తులకు మీ ప్రేమను స్టోరీ రూపంలో తెలియజేయాలి మీరు వారిని ప్రేమిస్తున్నట్టు వారికి అర్థమయ్యే విధంగా స్టోరీ వివరించాలి.
ఇలా మాట్లాడుతూనే మీ మనసులో వారికి ఎంతో గొప్ప స్థానాన్ని ఇస్తున్నట్టు తెలియజేయడానికి ప్రయత్నం చేయాలి.
కుటుంబానికి దగ్గర కావాలి:సాధారణంగా మీరు ఒక అబ్బాయి లేదా అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు
వారి కుటుంబ సభ్యులకు ముందు దగ్గర కావాలి ఈ క్రమంలోనే వారి సోదరి లేదా సోదరుడితో పరిచయం ఏర్పరుచుకోవాలి.
వారి అమ్మానాన్నలతో కూడా మంచి పరిచయం ఏర్పరచుకొని మీరు చేస్తున్నటువంటి మంచి పనుల గురించి వారి దగ్గర ప్రస్తావిస్తూ వారి మనసులో మంచి చోటు సంపాదించుకోవాలి.
బుక్ లో లవ్ లెటర్ పెట్టి ఇవ్వడం:మనం ఎన్నో సినిమాలలో ఈ సీన్లను చూసే ఉంటాం ఇలా మనం ప్రేమించిన వ్యక్తులకు మన ప్రేమను తెలియజేయాలి అంటే
ముందుగా స్నేహితులు ఎంతో అవసరమవుతారు అయితే స్నేహితులు లేని వారు ఇలా బుక్ లో లవ్ లెటర్ పెట్టి మన ప్రేమను వ్యక్తపరచడం అవసరం..