రీసెంట్ గా సౌత్ ఇండియా సినిమా దగ్గర అనౌన్స్ అయ్యి భారీ హైప్ అందుకున్న చిత్రం ఏదైనా ఉంది అంటే అది ఖచిట్టగాతమిళ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న “లియో” సినిమానే అని చెప్పి తీరాలి.
దర్శకుడు లోకేష్ కనగ రాజు తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ఏక్షన్ డ్రామా తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఓ సినిమా కావడం దీనిపై సెన్సేషనల్ హైప్ ని తెచ్చి పెట్టింది.
అయితే ఈ సినిమాకి లోకేష్ కనగ రాజ్ ఓసెన్సేషనల్ క్యాస్టింగ్ కూడా పట్టుకున్నాడు.
మరి ఈ చిత్రంలో అయితే ఫైనల్ గా 14 ఏళ్ల తర్వాత విజయ్ తో స్టార్ హీరోయిన్ తమిళ్ తలైవి త్రిష హీరోయిన్ గా ఫిక్స్ కావడం మరో ఆసక్తిగా మారింది.
అయితే ఈ సినిమా షూట్ కూడా శరవేగంగా ఇప్పుడు అనౌన్స్ అయ్యి కొనసాగుతుంది.
అయితే ఈ షూట్ లో త్రిష అస్వస్థతకు లోనైనట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ అప్డేట్. కాగా రీసెంట్ గా చిత్ర యూనిట్ అంతా కాశ్మీర్ కి స్టార్ట్ అయ్యిన సంగతి తెలిసిందే.
ఈ షెడ్యూల్ లో చలి తీవ్రత మూలాన త్రిష చాలా ఇబ్బందికి లోనైందట.
దీనితో అక్కడ ఉండలేకపోయింది అని తీవ్ర జ్వరానికి కూడా ఆమె లోను కాగా వెంటనే అక్కడ నుంచి వచ్చేసింది అని తెలుస్తుంది.
కాగా ఈ షెడ్యూల్ లో ఆమె సీన్స్ ఆల్ మోస్ట్ కంప్లీట్ చేయగా ఆమె ఇంటికి వచ్చేసినట్టుగా సినీ వర్గాల సమాచారం.
ఇంకా ఈ సినిమాకి అనిరుద్ అయితే సంగీతం అందిస్తుండగా ఈ సినిమాకి కార్తీ “ఖైదీ” సినిమాకి లింక్ ఉండొచ్చని పలు రూమర్స్ ఉన్నాయి.