దేశంలో నెలకొన్నటువంటి ప్రధాన సమస్యలలో నిరుద్యోగ సమస్య ఒకటి ఎంతో మంది యువత చదువుకున్నప్పటికీ
సరైన ప్రభుత్వ ఉద్యోగాలు రాక ఎన్నో ప్రైవేట్ సంస్థలలో చాలీచాలని జీతంతో సతమతమవుతున్నారు.
అయితే మరికొందరు మాత్రం ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలన్న నేపథ్యంలో లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్తూ శిక్షణ తీసుకుంటున్నారు.
అయితే ఇలా శిక్షణ తీసుకునే వారికి ఆసరాగా ప్రభుత్వం నిలబడింది. ఇలా శిక్షణ తీసుకుంటూ
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు చత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది.
ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ తీసుకోవడానికి అలాగే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం నెల నెల నిరుద్యోగులకు
నిరుద్యోగ భృతి అందజేయనున్నట్లు చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రకటించారు.
ఈ ఏడాది చివరిలో చత్తీస్గఢ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం.
2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన కీలక వాగ్థానాలతో ఇది ఒకటి. అయితే 15 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ చత్తీస్గఢ్ లో అధికారాన్ని చేపట్టింది.
అయితే ఈ ఏడాది చివరిలో మరోసారి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్యమంత్రి భూపేష్ బస్తర్
జిల్లా ప్రధాన కార్యాలయం జగదల్ పూర్ లో లాల్ భాగ్ పరేడ్ మైదానంలో జెండా ఆవిష్కరణ చేశారు.
ఈ క్రమంలోనే ప్రజలను ఉద్దేశిస్తే మాట్లాడినటువంటి ఈయన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు.