టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ట్రోల్స్ తో మొదలైనప్పటికీ సాలిడ్ బిజినెస్ తో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరిచిన అక్కినేని హీరో
ఎవరన్నా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా అఖిల్ అక్కినేని అనే చెప్పాలి. అఖిల్ హీరోగా ఇప్పుడు చేస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నే “ఏజెంట్”.
దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ఇది కాగా
టాలీవుడ్ టైర్ 2 హీరోస్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ఇది.
అయితే అప్పట్లో లైగర్ కి పోటీగా కూడా అనిపించింది. కానీ పలుమార్లు వాయిదా మీద వాయిదా పడుతూ వచ్చింది.
అయితే ఈరోజు ఎట్టకేలకు చిత్ర యూనిట్ ఓ మాసివ్ అప్డేట్ ని ఈ చిత్రం రిలీజ్ కి ముహూర్తం కన్ఫర్మ్ చేశారు.
ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా ఈ ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయగా దీనిపై రిలీజ్ చేసిన వీడియో కోసం ప్రత్యేకంగా మాట్లాడుకొని తీరాలి.
ఏదో సంస్థకి పట్టుబడిన స్పై ని ఎంతలా చిత్రవధ చేస్తారో ఇందులో చూపించడం ఓ రేంజ్ లో అనిపించింది.
పైగా అఖిల్ నటనలో ఇంప్రూవ్మెంట్ అయితే మైండ్ బ్లాకింగ్. తన యాటిట్యూడ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా వైల్డ్ గా కనిపిస్తున్నాయి.
దీనితో తన విశ్వరూపమే చూపించాడని చెప్పడంలో సందేహం లేదు.
ఈ సినిమాలో మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటించగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.