ok-adobestock-158863537-antonioguillem-depression-1333x1000

 మీ రోజువారి కార్యకలాపాల్లో తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నారా…. ఇలా చేయండి!

effects-of-depression

 మనలో తలెత్తే అనేక అనారోగ్య సమస్యలకు ముఖ్య కారణం మానసిక ప్రశాంతత లోపించి తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

benefits-of-working-from-home

 మానసిక ప్రశాంతత లోపించడానికి అసలు కారణాలను పరిశీలిస్తే మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి రీత్యా శ్రమించే సమయం పెరిగిపోయి, విశ్రాంతి తీసుకునే సమయం తగ్గడం.

stress

 ఒక కారణమైతే దీనికి తోడు ఆరోగ్య కారణాలు, ఆర్థిక కారణాలు, వ్యక్తిగత కారణాలు తోడవడంతో మానసికంగాను శారీరకంగాను తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని రక్తపోటు,

 గుండె జబ్బులు,డయాబెటిస్ అల్జిమర్, నిద్రలేమి సమస్య వంటి దీర్ఘకాలిక వ్యాధులతో సహజీవనం చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.

 ఇప్పటికైనా మేల్కొని రోజువారి కార్యకలాపాలు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే శారీరక ,మానసిక ఒత్తిడిని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.

 ప్రతిరోజు మీ ఆరోగ్యానికి హాని కలిగించే కాఫీ, టీ, ధూమపానం, ఆల్కహాల్ వంటి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండండి.మీకు ఎక్కువగా టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటే

 దీనికి ప్రత్యామ్నాయంగా వేడివేడి గ్రీన్ టీ ని సేవిస్తే మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది.

 గ్రీన్ టీ లో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను ఉత్తేజపరిచి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు.

 మనసు ఆందోళనగా ఉన్నప్పుడు మీకు ఇష్టమైన స్నేహితులు లేదా బంధువులతో ఫోన్లో కానీ లేదా డైరెక్ట్ గా కలిసి మాట్లాడితే మీలో ఉన్న భయాలు మరుగునపడి మెదడుకు ప్రశాంతత కలుగుతుంది.

 ఎప్పుడు మొబైల్, కంప్యూటర్, టీవీ లకు అంటి పెట్టుకోకుండా అప్పుడప్పుడు మెదడు చురుకుదనాన్ని పెంచే పజిల్ గేమ్స్, డ్రాయింగ్, సంగీతం వినడం

 సంగీతం వంటివి అలవాటు చేసుకుంటే ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొంత శారీరిక శ్రమ కలిగిన యోగ, నడక,

 వ్యాయామము వంటివి అలవాటు చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొంది రోజంతా మిమ్మల్ని చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.