గుమ్మడికాయలను పండగ సందర్భాల్లోనూ, ఇంటికి దిష్టి తీయడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారున్న అపోహ చాలామందిలో ఉంటుంది.
గుమ్మడికాయతో ఎన్నో రుచికరమైన వంటలు, స్వీట్లు తయారుచేస్తారు. అయితే చాలామంది గుమ్మడితో వివిధ రకాల వంటలు చేసుకుని గుమ్మడి విత్తనాలను పారేస్తారు
గుమ్మడి విత్తనాలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకపై ఎవరు కూడా చేయరు. గుమ్మడి విత్తనాలలో మన శరీరానికి అవసరమైన విటమిన్ సి,
కే, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, బీటా కెరోటిన్, పోలేట్, ఫైబర్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
తరచూ గుమ్మడికాయను మన ఆహారంలో భాగం చేసుకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు గుప్పెడు గుమ్మడి గింజలు తింటే వీటిల్లో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె
మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి నీరసం ,అలసటను తొలగించి రోజంతా మనల్ని చురుగ్గా ఉంచుతుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి గుమ్మడి గింజలు ఔషధంగా పనిచేస్తాయి. మనకు సుఖప్రదమైన నిద్రను కలగజేసేది మెలటోనిన్ అనే హార్మోన్
గుమ్మడి గింజల్లో ఉండే ఔషధ గుణం మెలటోనిన్ అనే హార్మోన్ ను ఉత్తేజపరిచి మనకు సుఖప్రదమైన నిద్రను కలగజేస్తుంది.
నిద్రపోయే ముందు కొన్ని గుమ్మడి గింజలు తినడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు కొన్ని గుమ్మడి గింజలు తినడం వల్ల
వీటిలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం, ఫైబర్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.