ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో మళ్ళీ భారీ హైప్ నడుమ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న చిత్రం “కబ్జా” కూడా ఒకటి.
కన్నడ ఇండస్ట్రీ నుంచి “కేజీఎఫ్” చిత్రం తర్వాత మళ్ళీ అంత హైప్ నడుమ ఈ సినిమా వస్తుంది.
పైగా ఈ చిత్రం కూడా కేజీఎఫ్ షేడ్స్ లోనే ఉండడంతో దీనికి దానికి దగ్గర పోలికలు కూడా చాలానే అనిపించాయి.
ఇక ఈ సినిమా అయితే ఈ మార్చ్ 17 న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుండగా తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సినిమాని ఇప్పుడు మన టాలీవుడ్ యంగ్ హీరో హక్కులు సొంతం చేసుకుని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసాడు.
మరి ఆ హీరో యూత్ స్టార్ నితిన్ కాగా తన కొత్త బ్యానర్ ల నుంచి అయితే కబ్జా సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా తాను తెలిపాడు.
మరి ఈ సినిమాని తాను రిలీజ్ చేయనుండడం ఆనందంగా ఉందని కూడా తెలిపాడు. కాగా ఈ చిత్రాన్ని చంద్రు దర్శకత్వం వహించగా శ్రేయ హీరోయిన్ గా నటించింది.
అలాగే మరో స్టార్ హీరో సుదీప్ కూడా ఈ సినిమాలో నటించగా ఒరిజినల్ గా కేజీఎఫ్ నిర్మాణ సంస్థ
హోంబలె ఫిల్మ్స్ వారే నిర్మాణం వహించగా ఆ సినిమా సంగీత దర్శకుడు రవి బాసృర్ సంగీతం అందించాడు.
మరి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి సెన్సేషన్ ని సెట్ చేస్తుందో లేక ఏం అవుతుందో చూడాల్సిందే.