ఈ కొన్ని రోజుల్లో అయితే సౌత్ ఇండియా స్టార్ అండ్ మోస్ట్ డేడికేటివ్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత కోసం అయితే పలు ఆసక్తికర వార్తలు బయటకు వస్తున్నాయి.
మరి అలా లేటెస్ట్ గా వచ్చిన వాటిలో తన భారీ పాన్ ఇండియా సినిమా శాకుంతలం కోసం మాత్రమే కాకుండా తన మరో ఓటిటి ప్రాజెక్ట్ నుంచి కూడా డీటెయిల్స్ కొన్ని బయటకి వచ్చాయి.
అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా సమంత ఇప్పుడిప్పుడే ఆక్టివ్ గా మారడంతో తనపై పలు ఆసక్తికర వార్తలు బయటకి వస్తున్నాయి.
ఇలా బాగానే ఉండగా సడెన్ గా సమంత అయితే మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ మాస్ హీరోస్ లో ఒకడైన రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి అయితే ఆమె ఇప్పుడు సారీ చెప్పడం షాకింగ్ గా మారింది.
మరి అసలు ఈ స్టోరీ లోకి వెళితే ప్రస్తుతం సమంత హీరోయిన్ గా ఈ హీరోతో దర్శకుడు శివ నిర్వాణ తో “ఖుషి” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ అయ్యిన ఈ చిత్రం సమంత కి ఆరోగ్యం బాగోకపోవడం మూలాన వాయిదా పడి ఎక్కువ కాలమే ఆగాల్సి వచ్చింది.
దీనితో విజయ్ ఫ్యాన్స్ సమంత వల్లే ఈ సినిమా ఆగిపోతుంది అని కాస్త గుస్సా గా ఉన్నారు. దీనితో ఇందుకు గాను విజయ్ ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో సమంత సారీ చెప్పి
ఈ చిత్రాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామని అప్డేట్ ఇచ్చింది. దీనితో ఇలా సమంత సారీ చెప్పడం అనేది సోషల్ మీడియాలో వైరల్ గా తన ఫ్యాన్స్ కి ఒకింత షాకింగ్ గా మారింది.
అయితే సమంత ఇప్పుడిప్పుడే తన మాయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడుతున్న సంగతి తెలిసిందే.