నందమూరి హీరోలలో ఒకరైన తారకరత్న అనారోగ్యానికి గురి కావడం గురించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయన శరీరంలోని కొన్ని భాగాలు నీలం రంగులోకి మారడం గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం. ఆయన అనారోగ్యానికి పూర్తిస్థాయి కారణాలు తెలియాల్సి ఉంది.
గతంలో తారకరత్నకు అనారోగ్య సమస్యలు ఉన్నట్టు వార్తలు ప్రచారంలోకి రాలేదు. టీడీపీ సభలో ఈ ఘటన చోటు చేసుకోవడం, లోకేశ్ పాదయాత్ర మొదలైన రోజునే ఈ విధంగా జరగడం టీడీపీని కలవరపెడుతోంది.
తారకరత్న ఆరోగ్యానికి ఏమైనా అయితే మాత్రం కొంతమంది లోకేశ్ ను నిందించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. తారకరత్నపై విషప్రయోగం జరిగిందంటూ
వార్తలు ప్రచారంలోకి వస్తుండటం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది. లోకేశ్ పాదయాత్రకు ప్రకృతి సైతం సహకరించడం లేదనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
తారకరత్న అనారోగ్యం విషయంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. మరోవైపు లోకేశ్ సభలలో బాగానే మాట్లాడుతున్నాడని వినిపిస్తున్నా చివరివరకు లోకేశ్ అదే విధంగా చేస్తారో లేదో తెలియాల్సి ఉంది.
లోకేశ్ పాదయాత్రను జనం మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. వైసీపీ పరిపాలన ఎలా ఉన్నా టీడీపీ పాలనతో పోల్చి చూస్తే బెటర్ గానే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
లోకేశ్ తన ప్రసంగంలో జగన్ పై విమర్శలు చేయడం మినహా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలాంటి స్కీమ్స్ అమలవుతాయో చెప్పడం లేదు.
సొంతంగా ఎక్కడా గెలవని లోకేశ్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితులు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ దెబ్బకు లోకేశ్ కు వరుస షాకులు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయి.