సాధారణంగా దూర ప్రయాణాలు చేసేవారు రైలులో ప్రయాణించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఎందుకంటే రైలు ప్రయాణం సురక్షితమే కాకుండా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది.
అయితే ఇలా రైలు ప్రయాణం చేసిన వారు రైలు మీద , రైల్వే స్టేషన్లో ఉండే అనేక గుర్తులను గమనించి ఉంటారు. కాకపోతే గుర్తులను ఎందుకు పెట్టారు చాలామందికి అవగాహన ఉండదు.
రైల్వే స్టేషన్లో, రైలు మీద ఉండే కొన్ని రకాల గుర్తుల వెనుక చాలా కారణాలు ఉంటాయి. ఇదిలా ఉండగా రైలు చివరి బోగి వెనుక పసుపు రంగులో పెద్దగా ఎక్స్ అనే అక్షరం రాసి ఉంటుంది.
అయితే ఎందుకు అల రాస్తారో చాలామందికి తెలియదు. అసలు అలా ఎక్స్ అనే అక్షరం ఎందుకు రాస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రైలులో చివరి భోగి వెనక పెద్దగా ఎక్స్ అని వేస్తారు. అలాగే దానికి కొంచెం దగ్గరలో ఎల్వి అనే అక్షరాలను కూడా రాస్తారు.
రైలు భోగి వెనక ఇలా ఎక్స్ అనే అక్షరం రాసి దానికి దగ్గరలో ఎల్వి అని రాయటానికి గల కారణం ఏమిటంటే…
ఎల్ వి అంటే లాస్ట్ వెహికల్ అని అర్థం. రైలు చివరి భోగి అని తెలపటానికి అలా రాస్తారు. అలాగే రైలు చివరి భోగి వెనక భాగంలో చిన్న ఎల్లో కలర్ బోర్డు కూడా ఉంటుంది.
ఇది బోగికి రెండువైపులా ఉంటుంది. అలాగే ఎక్స్ సింబల్ కింద భాగంలో ఒక రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది.
అయితే చివరి భోగి వెనకాల పసుపు రంగుతో ఇలా ఎక్స్ అనే అక్షరం రాయటమే కాకుండా దానికింద రెడ్ లైట్ పెట్టడానికి కారణం ప్రమాదాలను అరికట్టటం.
రాత్రి సమయంలో రైలు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పసుపు రంగుతో ఎక్స్ అనే అక్షరం రాస్తారు. ఈ పసుపు రంగుకి లైట్ రిఫ్లెక్షన్ శక్తి ఎక్కువగా ఉంటుంది అందువల్ల చీకట్లో కూడా ఈ పసుపు రంగు బాగా కనిపిస్తుంది.
అయితే రాత్రిపూట భోగి వెనకాల ఉండే ఎక్స్ సింబల్ కింద ఉండే రెడ్ లైట్ ని బట్టి అలెర్ట్ అవుతారు. ప్రమాదాలు ఏమి జరగకుండా ఉండడానికి ఈ సింబల్స్ ని వేస్తూ ఉంటారు.