ఈ ఆధునిక యుగం లో టెక్నాలజీ ఎంతగానో డెవలప్ అయ్యింది. టెక్నాలజీ ఎంత పెరిగినా సరే ఇప్పటికీ ఎంతోమంది వాస్తు శాస్త్రాన్ని అనుసరించి పనులు చేస్తూ ఉంటారు.
వాస్తును అనుసరిస్తే ఎటువంటి ప్రభావాలు ఉండవని బలంగా నమ్ముతూ వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. అయితే వాస్తు నియమాలు పాటించేవారు
కచ్చితంగా ఇప్పుడు మనం చెప్పబోయే విషయాలను కచ్చితంగా పాటించాల్సిందే. మన హిందూ సంప్రదాయంలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
అందువల్ల ప్రజలందరూ ఇంట్లో ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో పూజలు చేసినప్పుడు అగర్బత్తీలు కచ్చితంగా వెలిగిస్తారు.
ఇలా పూజ చేసిన తర్వాత అగర్బత్తీలు వెలిగించడం వల్ల వాటి సువాసనకు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకని ప్రతిరోజు అగరబత్తీలను వెలిగిస్తూ ఉంటారు.
నిపుణుల ప్రకారం అగర్బత్తిలను వెలిగించడం వల్ల ఇంట్లోని బ్యాక్టీరియా కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది.
అయితే వాస్తు శాస్త్ర ప్రకారం ప్రతిరోజు అగర్బత్తీలు వెలిగించకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మంగళవారం ఆదివారం రోజు అగర్బత్తిలను అసలు వెలిగించకూడదు.
ఎందుకంటే మంగళవారం, ఆదివారం రోజున అగర్బత్తిలను వెలిగించడం వలన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు మొదలవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
అందువల్ల మంగళవారం, ఆదివారం రోజున ఇంట్లో అగరబత్తీలు వెలిగించకూడదు. .