పురాతన ఆయుర్వేద వైద్యంలో వాము గింజలకు చాలా ప్రాముఖ్యత ఉంది.వాము లో ఉన్న ఔషధ గుణాలు ఎన్నో మొండి వ్యాధులను నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.
సాధారణంగా మనం వాము గింజలను మౌత్ ప్రెషర్ గా ఉపయోగిస్తుంటాం. వాము గింజల్లో ఔషధ గుణాలతో పాటు
నిత్య జీవక్రియలకు అవసరమైన విటమిన్స్ ,మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బయోటిన్ గుణాలు సమృద్ధిగా లభిస్తాయి. కావున ప్రతిరోజు ఉదయాన్నే వాము గింజల కషాయాన్ని సేవిస్తే
అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలుపొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాము గింజలతో రుచికరమైన కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మొదట తగినన్ని నీళ్లను తీసుకొని అందులో వాము గింజలు లేదా వాము పొడిని వేసి బాగా మరగనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టుకుని అందులో రుచి కోసం తేనె, నిమ్మరసం, పుదీనా ఆకులను కూడా వేసుకోవచ్చు.
ఈ హెర్బల్ టీ ని ప్రతిరోజు అల్పాహారానికి ముందే సేవిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అతి బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు వాము కషాయాన్ని సేవిస్తే ఇందులో ఉండే ఔషధ గుణాలు మెటబోలిజంను పెంచి అధికంగా ఉన్న క్యాలరీలను కరిగించడంలో సహాయపడతాయి
తద్వారా సహజ పద్ధతిలో శరీర బరువును నియంత్రించుకోవచ్చు. శరీర బరువు తగ్గితే రక్తపోటు, ఉబకాయం, డయాబెటిస్ వ్యాధి ముప్పు తగ్గినట్లే.
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు వాము హెర్బల్ టీ సేవిస్తే స్వల్ప కాలంలోనే మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
వాము లో ఉన్న ఔషధ గుణాలు మలబద్ధకం గ్యాస్ట్రిక్ అజీర్తి వంటి సమస్యలను తొలగించి పొట్ట మరియు పేగులోని వ్యర్ధాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది.
వాము లో ఉన్న సహజ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియన్ గుణాలు, మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సీజనల్గా వచ్చే అనేక ఇన్ఫెక్షన్లను అలర్జీలను నియంత్రించడంలో సహాయపడతాయి.
జీవ నియంత్రణ ద్రవాలు సక్రమంగా జరిగి కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. మూత్రశయ ఇన్ఫెక్షన్ తొలగి కిడ్నీ పనితీరు మెరుగు పడుతుంది.