కరోనా వైరస్ ప్రమాదం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో కేరళ రాష్ట్రంలో మరో కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతూ కలవరపాడుకు గురిచేస్తోంది.
ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ వైరస్ సోకితే రెండు రోజులపాటు తీవ్రమైన వాంతులు విరేచనాల సమస్య తలెత్తుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అసలు విషయానికొస్తే కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఆరు సంవత్సరాల ఇద్దరు పిల్లలు రెండు రోజులపాటు తీవ్రమైన వాంతులు విరేచనాల లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా
వైద్యులు వీరికి కొన్ని రకాల పరీక్షలు చేస్తే ఆ పరీక్షల్లో పిల్లలిద్దరూ నోరా వైరస్ అనే అంటువ్యాధి బారిన పడినట్టు గుర్తించారు వైద్యులు.
దీంతో మిగతా విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించి పాఠశాలకు సెలవు ప్రకటించారు. పిల్లల నుంచి తల్లిదండ్రులకు కూడా ఈ అంటు వ్యాధి సోకినట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.
నోరా వైరస్ తీవ్రమైన అంటువ్యాధి తొందరగా ఈ ఇన్ఫెక్షన్ ఇతరులకు వ్యాపిస్తుంది. సాధారణంగా కలుషితమైన నీరు,ఆహారం తినడం వల్ల నోరా వైరస్ వచ్చే అవకాశం ఉంది.
ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉండడం వల్ల కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ను నియంత్రించడం కష్టం ఎందుకంటే అవి అన్ని వేడి, శీతల ఉష్ణోగ్రతలను, క్రిమిసంహారకాలను కూడా తట్టుకునే స్థితిలో ఉంటాయి.
కాబట్టి నోరా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే ఉత్తమైన మార్గం కాబట్టి ఆహారం,నీరు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. వేడి తాజా ఆహార పదార్థాలను మాత్రమే తినాలి,
పళ్ళు కూరగాయలను శుభ్రంగా కడుక్కోవాలి, ఆహారం తింటున్న ప్రతిసారి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
నోరా వైరస్ మొదట అమెరికా రాష్ట్రమైన ఒహియోలోని ఒక పట్టణం 1972లో ఇది వ్యాప్తి చెందింది.
అప్పట్లో దీన్ని నార్వాక్ వైరస్ అని పిలిచేవారు.నోరా వైరస్‌ని ఫుడ్ పాయిజనింగ్ లేదా స్టమక్ బగ్ అని పిలుస్తారు. ఈ వైరస్ సోకిన 12 నుంచి 48 గంటల మధ్య విపరీతమైన వాంతులు, విరోచనాలు, పొట్టనొప్పి మొదలవుతాయి.
ఒకరి నుంచి ఒకరికి సోకడానికి ఒకటి నుంచి మూడు రోజులు పడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు త్వరగా సోకుతున్నట్టు గుర్తించారు. కొందరిలో ఈ వైరస్ ప్రాణాంతకం కావచ్చు.
ప్రతి ఏడాది ఫుడ్ పాయిజనింగ్ కేసుల్లో అత్యధికం నోరా వైరస్ కారణమని చెబుతున్నారు. నోరా వైరస్ సోకితే మొదట తీవ్రమైన వాంతులు,
విరోచనాలు, కడుపునొప్పి జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే డిహైడ్రేషన్ సమస్య తలెత్తి నోరు, గొంతు తొందరగా ఆరిపోవడం, కండరాల నొప్పులు, అలసట వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.