రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీతా గోవిందం సినిమాతో పెద్ద దర్శకుడిగా మారిపోయాడా పరశురామ్.
ఆ తర్వాత మహేష్‌బాబుతో సర్కారువారి పాట సినిమా చేసి హిట్ కొట్టాడు. ఈ మూవీలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ నటించింది.
సర్కారువారి పాట సక్సెస్ తర్వాత నాగచైతన్య సినిమాను పట్టాలెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేసిన ఈ దర్శకుడు…
ఈ సినిమాకు నాగేశ్వరరావు అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టినట్లు కూడా వార్తలు బయటకు వచ్చాయి.
14 రీల్స్ పల్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు జరిగాయి. కానీ సర్కారువారి పాట విడుదలై దాదాపు ఏడు నెలలు గడుస్తోన్న
నాగచైతన్య, పరశురామ్ సినిమా షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారమైతే జరుగుతోంది.
ఇక పరశురామ్ సిద్ధం చేసిన కథ నాగచైతన్యకు నచ్చలేదని తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తి కలగపోవడంతో నాగచైతన్య ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సినిమా వర్గాల సమాచారం.
నాగచైతన్య, పరశురామ్ ఈ సినిమాను పక్కనపెట్టినట్లే అంటున్నారు. నాగచైతన్య ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో…
విజయ్ దేవరకొండతో దర్శకుడు పరశురామ్ సంప్రదింపులు జరుపుతోన్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి.
గీతగోవిందం సక్సెస్ తో పరశురామ్ తో విజయ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ లో అయితే ఈ న్యూస్ హల్ చల్ చేస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది.
మరి దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం నాగచైతన్య కస్టడీ షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే విక్రమ్ కె కుమార్‌తో దూత అనే వెబ్‌సిరీస్‌లో కూడా నటిస్తున్నాడు.