ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి గీత గోవిందం సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
గీత గోవిందం సరిలేరు నీకెవ్వరు పుష్ప వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది.
అలాగే తమిళ్ భాషలలో కూడా వరుస సినిమాలలో నటించి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులర్ అయింది. …!
ఇలా రష్మిక నటించిన పుష్ప సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన హీరోగా పాపులర్ అయింది.
హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో రష్మిక కాంతారా సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇక అప్పటినుండి రష్మిక వరుస వివాదాల్లో నిలుస్తూ వస్తోంది.
తాజాగా మిషన్ మజ్ను సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక సౌత్ ఇండస్ట్రీ గురించి చులకనగా మాట్లాడింది. ఇలా తరచూ వివాదాల్లో నిలుస్తూ ట్రోల్స్ ఎదుర్కొంటున్న రష్మిక
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ” తనపై వచ్చే ట్రోలింగ్ పై స్పందించింది.
ఈ మధ్యకాలంలో నేను ఏ పని చేసినా నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు..నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా అలా నన్ను నిందించడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది.
నేను ఏ పని చేసినా తప్పుపడుతున్నారు. నేను ఏం మాట్లాడిన తప్పే, మాట్లాడకపోయినా తప్పే.. అసలు ఇప్పుడు నేను ఊపిరి తీసుకోవడం కూడా నాకు కష్టంగా అనిపిస్తుంది.
కొంతకాలంగా మానసికంగా చాలా కృంగిపోతుంటారు. ఈ బాధ భరించలేక సినిమాలు చేయటానికి మనసు చచ్చిపోయి ఒక్కోసారి సినిమాలు మనేద్దామని అనిపిస్తుంది.
నా గురించి ఏమీ తెలియకుండా నాకు ఏమీ చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్లు నా గురించి తప్పుగా కామెంట్స్ చేసినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది అంటూ తన బాధని బయటపెట్టింది.