సాధారణంగా మనదేశంలో పసుపు పొడి వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంట్లో చేసే ప్రతి కూరలోనూ పసుపు తప్పనిసరిగా వేస్తూ ఉంటారు.
ఎందుకంటే పసుపు యాంటీబయటిక్ గుణాలు ఎక్కువగా ఉండి ఈ శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉపయోగపడుతుంది. మనం తయారు చేసే ప్రతి వంటకంలోనూ పసుపు తప్పనిసరిగా వేస్తారు.
పసుపు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా అందాన్ని పెంపొందించడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పసుపుని పూజలలో కూడా తప్పకుండా ఉపయోగిస్తారు.
ఇంట్లో కానీ దేవాలయాలలో కానీ పూజలు చేయాలంటే పసుపు కుంకుమ తప్పనిసరిగా ఉండాలి. కొంతమంది మహిళలు పసుపుని కాళ్లకు, మొహానికి రాసుకోవడానికి కూడా ఉపయోగిస్తారు .
ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత వివాహితులు పాదాలకు పసుపు రాసుకొని ఆ తర్వాత పూజా కార్యక్రమాలు మొదలుపెడతారు.
అయితే కాళ్లకు పసుపు రాసుకునే సమయంలో మహిళలు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు . అలాంటి పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
అందువల్ల మహిళలు కాళ్ళకి పసుపు రాసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొంతమంది మహిళలు కాళ్ళకి పసుపు రాసుకోవటానికి కాళ్ళని నీటితో తడిపి ఆ తర్వాత పసుపు రాస్తూ ఉంటారు. ఇలా పసుపు రాయటం వల్ల పాదాలకు పూర్తిగా పసుపు అంటుకోదు.
ఇలా పాదాలకు పూర్తిగా పసుపు అంటుకోకపోవడం అశుభ్రంగా భావిస్తారు. అంతేకాకుండా పాదాలకు పసుపు పూర్తిగా అంటుకోకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి.
అలాగే కొంతమంది పాదాలకు పసుపు అంటించిన తర్వాత మిగిలిన పసుపుని ఇంట్లో ఉన్న గడపలకు రాస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది.
ఎందుకంటే గడపని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాళ్లకు పెట్టి మిగిలిన పసుపుని గడపలకు పెట్టడం వల్ల ఆ ఇంట్లో అనేక సమస్యలు ఎదురవుతాయి.