ఏపీలో జనసేన పార్టీ సొంతంగా పోటీ చేస్తే మాత్రం దాదాపుగా అన్ని స్థానాలలో ఈ పార్టీ పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
జనసేనకు ఆర్థికంగా సహాయం చేసిన వాళ్లతో పాటు జనసేన సానుభూతిపరులకు కూడా టికెట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం బీజేపీ వైసీపీ ఒక పార్టీకి మరొకటి సహకరించుకునే ఛాన్స్ అయితే ఉంది.
మరోవైపు హైపర్ ఆది ఎక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ కు వ్యతిరేకంగా హైపర్ ఆది పులివెందుల నుంచి పోటీ చేయనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే పులివెందుల నుంచి హైపర్ ఆది పోటీ చేసినా ఫలితం ఉండదని పులివెందులలొ హైపర్ ఆదికి డిపాజిట్ కూడా దక్కడం కష్టమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మరోవైపు నగరి నుంచి హైపర్ ఆది పోటీ చేసే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే నగరిలో రోజా గెలవడానికి పడిన కష్టం అంతాఇంతా కాదు. స్థానికులు కాకుండా ఎవరు పోటీ చేసినా నగరిలో ఎదురుదెబ్బలు తగలడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హైపర్ ఆది పోటీ చేయడానికి గిద్దలూరు బెస్ట్ ఆప్షన్ అని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
అయితే హైపర్ ఆదికి నిజంగా రాజకీయాలపై ఆసక్తి ఉందో లేదో స్పష్టత రావాల్సి ఉంది.
హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ షోకు కూడా దూరంగా ఉన్నారు. అయితే హైపర్ ఆది రాజకీయాల్లో కూడా కమెడియన్ అవుతారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
పాలిటిక్స్ విషయంలో హైపర్ ఆది ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.