సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
కమలహాసన్ వారసురాలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొని హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది.
కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన శృతిహాసన్ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఇక్కడే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది .
ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన శృతిహాసన్ కొంతకాలం సినిమాలకు దూరం అయింది.
ఇక ఇటీవల రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ద్వారా ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి హిట్ అందుకుంది.
ఇక తాజాగా శృతిహాసన్ నటించిన రెండు సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల అవటమే కాకుండా ఆ రెండు సినిమాలు కూడా హిట్ అవ్వటంతో శృతిహాసన్ క్రేజ్ మరింత పెరిగింది.
బాలకృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన నటించిన రెండు సినిమాలు హిట్ అవటంతో టాలీవుడ్ లో శృతిహాసన్ కి అవకాశాలు పెరుగుతున్నాయి.
అయితే ఈ రెండు సినిమాలలో వీర సింహారెడ్డి సినిమాలో శృతిహాసన్ పాత్ర కొంచెం తక్కువగా ఉందని తెలుస్తోంది.
ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఈ క్రమంలో శృతిహాసన్ మాట్లాడుతూ… ఈ రెండు సినిమాల అభిమానుల నుండి కొంచం డిఫరెంట్ గా అభినందనలు వస్తున్నాయి.
అయితే వీర సింహారెడ్డి సినిమాలో నా పాత్ర ఎక్కువగా ఉంటుందని ప్రేక్షకులు భావించారు. అయితే ఈ సినిమాలో స్టోరీ మొత్తం బాలకృష్ణ చుట్టే తిరుగుతుందని నాకు ముందే తెలుసు.
కానీ యాక్షన్ సినిమాలలో నటించడం నాకు చాలా ఇష్టం. అంతే కాకుండా చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నేను ఇలాంటి స్టార్ హీరోలతో రీఎంట్రీ ఇవ్వటం మంచిదని భావించి
ఈ సినిమాలో నటించాను అంటూ చెప్పుకొచ్చింది. పూర్తిగా యాక్షన్ ఓరియెటెండ్ సినిమాలతో పాటు లేడి ఓరియెంటెడ్ సినిమా చేయాలనే కోరిక ఉందంటూ తన మనసులో మాటను చెప్పుకొచ్చింది.
సంక్రాంతికి రెండు హిట్లు అందుకున్న శృతి హాసన్ ఫుల్ ఖుషీగా ఉంది.