ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా లోనే కాకుండా వరల్డ్ వైడ్ సినిమా దగ్గర కూడా భారీ ఎత్తున హైప్ ఉన్న ప్రాజెక్ట్ లలో సెన్సేషన్ చిత్రం మహేష్ బాబు మరియు రాజమౌళి లది కూడా ఒకటి.
మరి ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కనుండగా ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ కానుంది అనే ఇతర అంశాలు సస్పెన్స్ గా నిలిచాయి.
అయితే తన గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ తో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి కి మంచి ఫేమ్ రాగా నెక్స్ట్ తన నుంచి ఏ సినిమా ఉంటుంది అనేది కూడా వరల్డ్ సినిమా దగ్గర ఆసక్తిగా మారింది.
మరి దీనిపై లేటెస్ట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియా తో మాట్లాడుతూ మరికొన్ని కీలక డీటెయిల్స్ అయితే తాను రివీల్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారిపోయింది.
మరి తాను మాట్లాడుతూ తాను నెక్స్ట్ ప్రాజెక్ట్ గా మహేష్ బాబు తో ఓ గ్లోబల్ సినిమా చేస్తున్నానని తెలిపారు.
అలాగే ఈ చిత్రం కోసం తాను ఓ హాలీవుడ్ ప్రముఖ టీం ని హైర్ చేసుకోగా వారితో సినిమా ఎలా ఉండాలి అనే అంశాలపై చర్చిస్తున్నానని వారి నుంచి ఐడియాలు తీసుకుంటున్నానని.
వారు వరల్డ్ వైడ్ సినిమా దగ్గర మంచి పట్టు ఉన్న వాళ్ళు కాగా ఈ సినిమా కోసం వారితో వర్క్ చేస్తున్నట్టు జక్కన్న తెలిపాడు.
ఇక మరిన్ని మాటలు జోడిస్తూ ఈ చిత్రం మహేష్ తో పదేళ్ల నుంచి పెండింగ్ గా ఉన్న ప్రాజెక్ట్ అని ఫైనల్ గా ఇప్పుడు వరల్డ్ వైడ్ సినిమాగా చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు.