తెలుగు చిత్రపరిశ్రమలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ఈమె ఈ వ్యాధితో బాధపడుతూ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఇలా చికిత్స తీసుకుంటూనే ఈమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలకు డబ్బింగ్ పూర్తి చేశారు.
అయితే ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నటువంటి ఈమె శాకుంతలం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమంతను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.
సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన అనంతరం పూర్తిగా మారిపోయారని ఆ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఈమె తెలుపు రంగు దుస్తులు ధరించడమే కాకుండా చేతికి రుద్రాక్ష మాల కూడా ఉండడంతో సమంతలో ఈ కొత్త మార్పుకు కారణం ఏంటి అనే విషయాల గురించి అభిమానులు చర్చలు జరుపుతున్నారు.
ఇక సమంత ఇలా జపమాల చేత పట్టుకొని ఆధ్యాత్మిక వైపు మల్లడం వెనుక ఓ వ్యక్తి ఉన్నారని ఆయన మరెవరో కాదు సద్గురు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సద్గురు ఎన్నో విశేషాలను హితబోధ చేస్తూ ప్రతి ఒక్కరిలోనూ నూతన ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే సమంత సద్గురును ఎంతగానో అభిమానించి గౌరవిస్తారు.
అయితే ఈమె మయోసైటిస్ వ్యాధి బారిన పడటంతో మానసిక ప్రశాంతత కోసమే సద్గురు చెప్పిన మాటలను వింటూ తరచూ జపం చేయడమే
కాకుండా నిత్యం శ్లోకాలు చదువుతూ కాస్త మానసిక ప్రశాంతత పొందుతున్నారని తెలుస్తుంది.