సాధారణంగా కొన్ని రకాల మొక్కలను మన ఇంటిలో మరియు ఇంటి పెరట్లో పెంచుకోవడం వల్ల మన ఇంటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని
తీగ జాతి కాయగూరల్లో దొండకాయ కు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా దొండ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు
ఎల్లప్పుడు తాజాగా ఉంచడంలో సహాయపడి మనలో శారీరక మానసిక ఆనందాన్ని పెంపొందిస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.
అయితే వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని రకాల మొక్కలను పెంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, నియమాలు కచ్చితంగా పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా మనందరి ఇండ్లలో కచ్చితంగా ఉండే మనీ ప్లాంట్ విషయంలో వాస్తు శాస్త్రం నిపుణులు సూచిస్తున్న నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనీ ప్లాంట్ ను ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం మీ వెంటే ఉండి అపారమైన ధన సంపద కలుగుతుందని అందరూ విశ్వసిస్తారు.
దానికి భిన్నంగా మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం వల్ల చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే మనీ ప్లాంట్ను ఇంట్లో ఎక్కడంటే అక్కడ పెట్టరాదు.
కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు, దిక్కుల్లోనే మనీప్లాంట్ను ఉంచుకోవాలి లేకపోతే అపారమైన ధన నష్టం కలిగి కష్టాల్లో కూరుకుపోతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మన ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచుకోవాలంటే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే అంశాలు పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. మనీ ప్లాంట్ను ఇంట్లో ఈశాన్య దిశలోఉంచకూడదు.
అలా ఉంచితే ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట.అలాగే ఇంట్లో పశ్చిమ దిశలో మనీ ప్లాంట్ను పెట్టకూడదు.
అలా చేస్తే దంపతుల మధ్య మనస్పర్థలు ఎక్కువగా వచ్చి తొందరగా విడిపోయే ప్రమాదం ఉంటుంది.ఇంట్లో ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ను ఉంచాలి. ఈ దిశ అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం.
అందువల్ల ఆ దిశలో మనీ ప్లాంట్ను ఉంచితే అదృష్టం బాగా కలసివస్తుంది. ఆరోగ్యం, ధనం కూడా బాగా చేకూరి భోగభాగ్యాలు సిద్ధిస్తాయని వాస్తు శాస్త్రం పండితులు చెబుతున్నారు.