టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరినటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “వీరసింహా రెడ్డి” కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంతా కూడా ఇప్పుడు వీరసింహా రెడ్డి కోసం మాట్లాడుకుంటున్నారు.
మరి ఈ సినిమాకి నెవర్ బిఫోర్ వసూళ్లు నమోదు అవుతాయని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేసేసారు.
అనుకున్నట్టే చిత్ర నిర్మాతలు కూడా తన చిత్రం 50 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్నట్టుగా తెలిపారు. మరి ఈరోజు అయితే ఫైనల్ గా అసలు లెక్కలు అయితే బయటకి వచ్చాయి.
చిత్ర యూనిట్ అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ ఫస్ట్ డే 54 కోట్ల భారీ గ్రాస్ వచ్చినట్టుగా తెలిపారు.
మరి వీటి డీటెయిల్స్ లో అయితే ఒక్క యూఎస్ నుంచే 15 కోట్లు వసూలు చేయగా నిజామ్ లో 10 కోట్లకి పైగా గ్రాస్ 5 కోట్లకి పైగా షేర్ రాబట్టింది.
అలాగే ఆంధ్ర రీజియన్ లో అయితే ఏకంగా 12 కోట్ల షేర్ ని ఈ చిత్రం అందుకుంది. అలాగే ఇక్కడ నుంచి ఏకంగా 20 కోట్ల మేర గ్రాస్ ని కొల్లగొట్టింది.
దీనితో వీర సింహా రెడ్డి టోటల్ గా 54 కోట్ల గ్రాస్ షేర్ ని అందుకోగా 30 కోట్ల మేర షేర్ ని వరల్డ్ వైడ్ సింగిల్ డే కి అందుకుందట.
దీనితో ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే అనుకున్నట్టుగా డబుల్ మార్జిన్ తో భారీ రికార్డు సెట్ చేసింది.
ఈ చిత్రాన్ని బాలయ్య అభిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే థమన్ సంగీతం అందించాడు.