గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై పోటీకి నందమూరి వారసుడ్ని దించుతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.
స్వర్గీయ ఎన్టీయార్ మవళ్ళలో ఒకరైన నందమూరి తారకరత్న, సినీ రంగంలో అనుకున్న స్థాయిని అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే.
సినిమాల్లో ఇక తనకు సరిపడదనుకుని, రాజకీయాల్లోకి వచ్చేసినట్టున్నాడు తారకరత్న.
గతంలో టీడీపీ తరఫున పలు సందర్భాల్లో ఎన్నికల ప్రచారానికే పరిమితమైన తారకరత్న, ఇకపై యాక్టివ్ పాలిటిక్స్ చేయబోతున్నాడట.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాననీ, ఆంద్రప్రదేశ్ నుంచి టీడీపీ తరపున ఎన్నికల బరిలో వుంటాననీ తారకరత్న మొన్నీమధ్యనే ప్రకటించాడు కూడా.
గుడివాడ టిక్కెట్టుని తారకరత్న ఆశిస్తున్నాడు. వైసీపీ నేత కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా వున్నారు.
ఆ గుడివాడ ఎమ్మెల్యే నానిపై తారకరత్న పోటీ చేస్తే ఏమవుతుంది.? తారకరత్న గెలిచే అవకాశమే లేదని స్థానికంగా వున్న పరిస్థితుల్ని బట్టి అర్థమవుతోంది.
అయితే, నానికి కొంత ఎదురుగాలి కూడా వీస్తోంది ఇటీవలి కాలంలో. అదే తమకు అడ్వాంటేజ్ అని టీడీపీ నమ్ముతోంది.
గుడివాడ నియోజకవర్గ టీడీపీ నేతలతో ఇప్పటికే నందమూరి తారకరత్న భేటీ అయి, అక్కడి పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నాడట.
గుడివాడ కాుద, ఉత్తరాంధ్ర నుంచి తారకరత్నను బరిలోకి దింపితే బెటర్.. అన్న దిశగా చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.