గత ఏడాది లో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం “భీమ్లా నాయక్” కూడా రిలీజ్ అయ్యింది.
మరి ఈ సినిమా సూపర్ హిట్ కాగా పవన్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచింది.
అయితే అంత వసూళ్లు వచ్చినప్పటికీ ఈ చిత్రానికి ఓ దగ్గర మాత్రం భారీ నష్టాలు తప్పలేదు.
ఆ సమయంలో ఏపీలో పరిస్థితిలు ఎలా ఉన్నాయో తెలిసిందే. టికెట్ ధరలు సరిగ్గా లేక మిగతా సినిమాలు ఆగిపోతున్న పరిస్థితి కాగా
తన సినిమా వస్తే తప్ప మిగతా సినిమాలకి లైన్ క్లియర్ అవ్వదు అని తెలిసి తన సినిమాకి నష్టం వచ్చినా పర్వాలేదు అని “భీమ్లా నాయక్” ని పవన్ రిలీజ్ చేయడం
ఆ తర్వాత ఏపీలో కొత్త టికెట్ ధరలతో కొత్త జివో రావడం జరిగింది. దీనితో ఏపీలో చాలా తక్కువ రేట్స్ లో రిలీజ్ అయ్యిన భీమ్లా నాయక్ నష్టాలనే అందుకుంది.
మరి దీనితో అయితే అక్కడ నష్టాలు సంగతి తాను చూసుకుంటానని భరోసా ఇచ్చి రిలీజ్ చేయించిన పవన్
తాను సుమారు 30 కోట్లు నష్టపోయినట్టుగా స్వయంగా పవన్ కళ్యాణే తెలపడం విశేషం.
పవన్ లేటెస్ట్ గా పెట్టిన పొలిటికల్ మీటింగ్ లో అయితే పవన్ ఇలా చెప్పడం జరిగింది.
దీనితో భీమ్లా నాయక్ పై ఒక రఫ్ క్లారిటీ అయితే వచ్చింది అని చెప్పొచ్చు.
ఇక ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా రానా కూడా నటించాడు అలాగే త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు.