ఈ సంక్రాంతి కానుకగా తెలుగు సినిమాతో పాటుగా తమిళ్ నుంచి కూడా భారీ పోటీ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
అక్కడ ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలు ఒకే రోజు వస్తుండడంతో అందరిలో ఓ రేంజ్ లో హైప్ నెలకొంది.
దీనితో హీరో లు అజిత్ మరియు విజయ్ ల అసలు స్టార్డం ఎలా ఉంటుంది అనేది ఓ క్లారిటీ వస్తుంది అని చూసారు.
మరి ఈ సినిమాల రిలీజ్ సమయంలో అయితే విజయ్ సినిమా వరిసు నిర్మాత మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయినటువంటి దిల్ రాజు చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తిగా మారాయి.
అజిత్ కన్నా బిజె క్రేజ్ అండ్ మార్కెట్ ఎక్కువ అని చేసిన కామెంట్స్ ఇప్పుడు వెనక్కి తీసుకునే పని చేసింది అజిత్ క్రేజ్.
తమిళ్ లో రిలీజ్ అయ్యిన తన తూనీవు చిత్రం విజయ్ సినిమా కన్నా భారీ వసూళ్లు కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
మరి మొదటి రోజు విజయ్ సినిమా దిల్ రాజు నిర్మాణం వహించింది ఓన్లీ తమిళ నాడులో 19.5 కోట్ల వసూళ్లు అందుకోగా అజిత్ సినిమా 21 కోట్ల వసూళ్లు అందుకుంది.
దీనితో దిల్ రాజు అజిత్ ని వేసిన అంచనా తప్పకుండా తప్పయింది అని చెప్పాలి.
వరల్డ్ వైడ్ గ్రాస్ సంగతి పక్కన పెడితే తమిళ్ లోనే విజయ్ మార్కెట్ పెద్దది తనకి ఎక్కువ థియేటర్స్ కావాలని తాను కోరారు కానీ ఇద్దరి హీరోల సినిమాలు సమాన స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యాయి
కానీ సీన్ కట్ చేస్తే అజిత్ సినిమా డామినేషన్ కనిపించింది. దీనిబట్టి దిల్ రాజు అజిత్ విషయంలో అంచనా తప్పయింది అని చెప్పి తీరాలి.