ఏదైనా కొత్త రాజకీయ పార్టీ మొదలైందంటే ఆ పార్టీ సొంతంగా ఎదగడానికి కృషి చేయాలి.
అయితే జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల మద్దతును పూర్తిస్థాయిలో పొందడంలో ఫెయిల్ అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ కు సీఎం పదవిపై ఆశ లేదా? లేక పవన్ కళ్యాణ్ ఇతర పార్టీల గెలుపు కోసమే కష్టపడుతున్నారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ కు రాజకీయాలు ఎప్పుడు అర్థం అవుతాయో అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
పవన్ ఇతర పార్టీలకు భిన్నంగా మేనిఫెస్టోను ప్రకటించి మరో 10 నుంచి 15 సంవత్సరాలు కష్టపడితే మాత్రమే సీఎం అయ్యే అవకాశం ఉంటుంది.
జనసేన పార్టీని బలోపేతం చేసే విషయంలో పవన్ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. పవన్ కు సీఎం కావాలనే లక్ష్యం లేదా? అని కొంతమంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఎంజీఆర్, ఎన్టీఆర్ లా పవన్ సీఎం కావాలని భావిస్తే మాత్రం ఈ విధంగా చేస్తేనే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి.
పవన్ కళ్యాణ్ సలహాదారులను నియమించుకుని వాళ్ల సూచనలకు అనుగుణంగా అడుగులు వేయాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ లో స్థిరత్వం లేదని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లకు చెక్ పెట్టే దిశగా పవన్ అడుగులు వేయాల్సి ఉంది.
చేసిన తప్పులనే పవన్ రిపీట్ చేస్తే మాత్రం రాజకీయాల్లో భారీ స్థాయిలో నష్టపోవాల్సి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీపై ఆధారపడి జనసేన రాజకీయాలు చేయడం పవన్ చేస్తున్న అతిపెద్ద తప్పు అని కామెంట్లు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో టీడీపీ ఏదైనా తప్పు చేస్తే పవన్ ఫలితం అనుభవించాల్సి ఉంది.
మామను వెన్నుపోటు పొడిచి రాజకీయాలు చేసిన చంద్రబాబును పవన్ ఎందుకు నమ్ముతున్నారో అర్థం కావడం లేదని కొంతమంది అభిప్రాయంవ్యక్తం చేస్తున్నారు.