ఫైనల్ గా సంక్రాంతి బిగ్ ఫైట్ టాలీవుడ్ లోకి కూడా వచ్చేసింది.
మరి ఈ సంక్రాంతి పందాన్ని అయితే మొదట మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ తన వీరసింహా రెడ్డి సినిమాతో స్టార్ట్ చేశారు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని తెరకెక్కించగా వరలక్ష్మి శరత్ కుమార్ మరియు దునియా విజయ్ లాంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు.
ఇక భారీ అంచనాలు నడుమ అలాగే యూఎస్ లో భారీ హైప్ తో గ్రాండ్ ప్రీమియర్స్ తో స్క్రీన్ పై పడిన ఈ చిత్రం తెలుగులో కూడా బెనిఫిట్ షోస్ సంపాదించుకుంది.
మరి ఈ షోస్ నుంచి ఆల్రెడీ ట్విట్టర్ లో సినిమా రిజల్ట్ అయితే బయటకి వచ్చేసింది.మరి ట్విట్టర్ ప్రజానీకం వీరసింహా రెడ్డి కోసం ఏమంటున్నారంటే.
సినిమాలో బాలయ్య కోసం చెప్పాల్సిన పని లేదు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఫ్యాక్షన్ పాత్రలో తాను అదరగొట్టేసారు.
ఇంకా సినిమాలో ఇంటర్వెల్ వరకు మంచి మాస్ స్టఫ్ తో కుమ్మేసిందట. కానీ అసలు ప్రాబ్లమ్ మాత్రం సెకండాఫ్ లోనే అట.
ఎంతో కీలకమైన సెకండాఫ్ ఈ సినిమాలో చాలా డల్ గా సాగదీస్తూ ఉంటుందట. దీనితో సినిమా ఇక్కడ మాత్రం దెబ్బ కొట్టింది అని చాలా మంది అంటున్నారు.
అది తప్ప మిగతా అంతా బాగుందట. వరలక్ష్మి కి మరోసారి మంచి రోల్ రాగా బాలయ్య ఫ్యాన్స్ కి ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చుతుందని అంటున్నారు.
కానీ మిగతా ఆడియెన్స్ లో మాత్రం కాస్త యావరేజ్ అనిపించొచ్చు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది.