టాలీవుడ్ లో ఉన్న దిగ్గజ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు.
మరి టాలీవుడ్ పెద్దగా స్టార్ గా ఇపుడు సినిమాలు చేస్తూ మళ్ళీ బిజీగా తాను ఉండగా తన గత చిత్రాలు ఓ మోస్తరుగా రాణించాయి.
మరి ఈ సినిమాల్లో ఆచార్య భారీ ప్లాప్ కావడంతో అక్కడ నుంచి తాను కూడా సినిమా నిర్మాణంలో జోక్యం చేసుకుంటున్నట్టుగా లేటెస్ట్ ఇంటర్వ్యూ లో తెలిపారు.
ఇక అలాగే లేటెస్ట్ గా తాను నటించిన తాజా చిత్రం “వాల్తేరు వీరయ్య” విషయంలో కూడా మాట్లాడారు.
అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి వారు ఈ సినిమాకి ఎక్కడా కూడా తగ్గకుండా భారీ బడ్జెట్ తో తీసేసారు.
అంతా బాగానే ఉంది కానీ ఆ మధ్య నిర్మాతలకి చిరు వార్నింగ్ ఇచ్చిన మాట నిజమే అని తాను ఒప్పుకున్నారు.
అయితే వారు సినిమాని ప్రేమతో అత్యద్భుతంగా తీయాలని ఖర్చుకి వెనకాడడం లేదు దాని తాలూకా అవుట్ పుట్ బాగానే ఉంటుంది
కానీ ఇలా జాగ్రత్త వహించకుండా ఖర్చు చేయడం అనేది మంచిది కాదు అని వారికి అయితే సినిమా సెట్స్ లో స్మూత్ గా చెప్పడం జరిగింది
అని అయితే చిరు లేటెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు.కాగా ఈ సినిమాని తన అభిమాని బాబీ దర్శకత్వం వహించగా శృతి హాసన్ మరియు కాథెరిన్ లు హీరోయిన్స్ గా నటించారు
అలాగే మాస్ మహారాజ్ రవితేజ కూడా ఓ కీలక పాత్ర చేయగా ఈ జనవరి 13న ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.