టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా గుర్తింపు పొందిన వారిలో రాజమౌళి ప్రథమ స్థానంలో ఉన్నాడని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు.
రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్గా రాజమౌళి గుర్తింపు పొందాడు.
ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా ద్వారా మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశాడు.
ఇక అప్పటినుండి రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది.
ఇక అయితే ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
ఈ సినిమా రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసింది.
ఈ ఆర్ఆర్ఆర్ సినిమాలో టాలివుడ్ ప్రముఖ హీరోలైన jr. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించగా.. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించాడు. ఈ సినిమా ద్వార వీరిద్దరికి కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.
ఈ సినిమాలో వీరి నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులు దక్కించుకుంది.
ఇక తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రెండు కేటగిరీల్లో ఈ సినిమా నామినేట్ అయింది. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ విభాగంలోనూ, నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలోనూ నామినేట్ అయిందీ .
జనవరి 11 వ తేదీన ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక చాలా ఘనంగా జరగనుంది.
ఇదిలా ఉండగా ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా ని లాస్ ఏంజిల్స్ లోని డీజీఏ థియేటర్ లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు రాజమౌళి తో పాటు ఎన్టీఆర్ కూడా హాజరయ్యాడు.
ఈ ప్రదర్శన సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ప్రశంసలు కురిపించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇద్దరి నటన అద్భుతంగా ఉందని, ఆర్ఆర్ఆర్ లో అన్నింటికంటే కొమురం భీముడో పాట అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు.
ఆ పాటలో తారక్ నటన అద్భుతం. ఇప్పటివరకూ తాను డైరెక్ట్ చేసిన వాటన్నింటిలో ఆ పాట తన ఆల్ టైం ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు.
అలాగే తారక్ కనుబొమ్మల పై కెమెరా ఫోకస్ చేస్తే తారక్ వాటితోనూ హావభావాలను పలికించగలడు అంటూ ప్రశంసలు కురిపించాడు.
ప్రస్తుతం ఎన్టీర్ గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.