టాలీవుడ్ నుంచి సంక్రాంతి కానుకగా ఇప్పుడు రాబోతున్న పలు లేటెస్ట్ చిత్రాల్లో
మాస్ చిత్రాలు బాలయ్య నటించిన “వీరసింహా రెడ్డి” కూడా ఒకటి దీనిని దర్శకుడు గోపీచంద్ మలినేని అయితే తెరకెక్కించాడు.
ఇక ఈ సినిమాపై అనేక అంచనాలు ఉండగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు.
కానీ ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం బాలయ్య కెరీర్ లోనే ఏ సినిమా కూడా అందుకోని రెస్పాన్స్ ని ఈ చిత్రం అందుకోవడం అందరిలో ఆసక్తిగా మారింది.
అయితే యూఎస్ మార్కెట్ లో వీరసింహా రెడ్డి వీరసింహా రెడ్డి సెన్సేషన్ ని అయితే రేపింది. ఈ చిత్రం ఆల్రెడీ మాస్ బుకింగ్స్ ని నమోదు చేసుకోగా.
ఇప్పుడు ఈ మార్క్ 4 లక్షల డాలర్స్ కి చేరినట్టుగా సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు ఖరారు చేశారు.
దీనితో ఇంకా రెండు రోజు ఉండగానే ఈ చిత్రం ఇంతమొత్తం అందుకొని దుమ్ము లేపింది.
ఇక ఇదిలా ఉండగా ఈ 4 లక్షల డాలర్స్ కూడా అసలు ఎలాంటి ఆఫర్స్ కూడా ఇవ్వకుండా వసూలు చేసి ఉండడం విశేషం అట.
దీని బట్టి వీరసింహా రెడ్డి వీరంగం ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటించింది.
అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మితి మేకర్స్ నిర్మాణం వహించారు.