సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందాలంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తర్వాతే సరైన గుర్తింపు లభిస్తుంది.
ఇలా ఇప్పుడు ఇండస్ట్రీలో నడిగినట్లుగా గుర్తింపు పొందిన ఎంతోమంది ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎన్నో ఇబ్బందులు పడే అవమానాలు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు.
అయితే కొంతమంది సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన తర్వాత కూడా ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కూడా అనేక మంది ఉన్నారు.
అలాంటి వారిలో ప్రముఖ నటుడు అజయ్ కూడా ఒకరు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా నటించి గుర్తింపు పొందాడు.
లక్ష్మి కళ్యాణం, విక్రమార్కుడు వంటి సినిమాలలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరైన అజయ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాల గురించి వెల్లడించాడు.
అప్పుడు అజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో ఒక ఇంటర్వూ లో పాల్గొన్న అజయ్ మాట్లాడుతూ తాను డబ్బులు లేక హోటల్ లో ప్లేట్స్ కడిగానని చెప్పుకొచ్చాడు.
ఒకానోక సమయంలో నేపాల్ కి వెళ్ళినప్పుడు ఆయన వద్ద ఉన్న డబ్బు మొత్తం అయిపోతే డబ్బు సంపాదించటం కోసం చాలా ఇబ్బంది పడ్డానని ,
డబ్బులు లేకపోతే ఇంటికి ఎలా రావాలో తెలియక ఓ టిబెటన్ రెస్టారెంట్లో ఎంగిలి ప్లేట్లు, గిన్నెలు కడిగారని ఆయన వెల్లడించాడు.
ఇలా నటుడిగా మంచి గుర్తింపు పొందింన అజయ్ చేతిలో డబ్బులు లేకపోతే డబ్బులు కోసం ఎంగిలి ప్లేట్స్ కూడా కడిగాడన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డబ్బు ఉన్నంతవరకు వాటి విలువ తెలియదని, డబ్బు లేకపోతే వాటిని సంపాదించటానికి కష్టం చేయక తప్పదని ఆయన వెల్లడించాడు.
అంతే కాకుండా ఆయన విలన్ పాత్రలో నటించటం వల్ల చాలా సందర్భాలలో తనకు దెబ్బలు తగిలినట్లు చెప్పుకొచ్చాడు.
ఒకానొక సమయంలో షూటింగ్ టైం లో జరిగిన ప్రమాదం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా వెల్లడించాడు.