గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కోసం తెలిసిందే.
దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం పవన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో అయితే
తెరకెక్కుతూ ఉండగా పవన్ తో పాటుగా ఈ సినిమాలో అనేకమంది బాలీవుడ్ స్టార్ లు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
మరి ఈ సినిమాలో రీసెంట్ గానే స్టార్ నటుడు బాబీ డియోల్ జాయిన్ అయ్యి తనపై ఓ ఏక్షన్ సీక్వెన్స్ ని కంప్లీట్ చేసినట్టుగా కొత్త అప్డేట్ బయటికి వచ్చింది.
ఇక ఈ సినిమాలో ఇప్పుడు మరో బాలీవుడ్ నటి జాయిన్ కానున్నట్టుగా తెలుస్తుంది. ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ నోరా ఫతేహి అట.
ఇప్పుడు ఈమెపై క్రిష్ పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించనుండగా తాను ఈ నెక్స్ట్ వారంలో సెట్స్ లో అడుగు పెట్టనుందని సమాచారం. మరి తాను ఎలాంటి రోల్ లో కనిపించనుందో చూడాలి.
ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా
ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు
అలాగే ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో పవన్ కెరీర్ లో ఖుషి తర్వాత చరిత్రలో నిలిచిపోయే సినిమాగా నిర్మాణం వహిస్తున్నారు.