శీతాకాలంలో అత్యధికంగా లభ్యమయ్యే స్వీట్ పొటాటో లేదా చిలగడ దుంపలను తరచూ ఆహారంలో తీసుకున్నట్లయితే
మన శరీరానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ బి6, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిజన్, పొటాషియం కాల్షియం ఫైబర్ వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభించి
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే శీతాకాలం లాంటి సీజన్లలో మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పోషించి శరీరంలో ఫ్రీ రాడికల్స్ తగ్గించి వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది.
శీతాకాలంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే వివిధ రకాల ఫ్లూ లక్షణాల నుంచి బయటపడాలంటే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉన్న చిలగడ దుంపలను
వారంలో ఒకటి లేదా రెండు సార్లు కచ్చితంగా తినాలని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. చిలకడదుంపల్లో ఉండే ఔషధ గుణాలు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి మనలో వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
అలాగే చలికాలంలో ఎక్కువ మందిని వేధించే కంటి అలర్జీల నుంచి కూడా రక్షణ కల్పించడంలో చిలగడ దుంపలు సహాయపడతాయి.
సాధారణంగా శీతాకాలంలో గుండె సంబంధిత సమస్యలు మరింత ఎక్కువగా వేధిస్తుంటాయి.
కావున హార్ట్ బీట్ ను క్రమబద్దీకరించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచే పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉండే స్వీట్ పొటాటోను ఎక్కువగా తినాలని చెబుతుంటారు.
అలాగే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడాన్ని నివారించే పైబ్రోనోజెన్ అనే మూలకం స్వీట్ పొటాటోలో అత్యధికంగా ఉంటుంది. కావున రక్తపోటు సమస్య నుంచి మనల్ని రక్షిస్తుంది.
స్వీట్ పొటాటోలో అత్యధికంగా ఉండే కార్బోహైడ్రేట్స్ తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయపడి రోజంతా మిమ్మల్ని అలసిపోకుండా ఉంచడంలో సహాయపడుతుంది.
అలాగే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసి మలబద్ధక సమస్యను తగ్గించి పొట్టలోని చెడు మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
స్వీట్ పొటాటోలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గించి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.