టాలివుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ ఇప్పుడు పాన్ఇండియా హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. టాలివుడ్ లో ప్రభాస్ నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
ఇలా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలలో డార్లింగ్ సినిమా కూడా ఒకటి. కరుణాకరన్ దర్శకత్వంలో 2010లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన కాజల్ నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మొదటగా ప్రభాస్ సరసన హీరోయిన్ గా కాజల్ కాకుండా
రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా పెట్టాలని డైరక్టర్ భావించారట. కానీ ప్రభాస్ అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.
ఇక రకుల్ ని రిజెక్ట్ చేసిన తర్వాత ఆ సమయంలో సమంత ఫుల్ ఫామ్ లో ఉండటంతో సమంత ని హీరోయిన్ గా పెట్టాలని అనుకున్నారు.
కానీ ప్రభాస్ సమంత ని కూడా రిజెక్ట్ చేసి కాజల్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
డార్లింగ్ సినిమా మంచి లవ్ ఎంటర్టైనర్ సినిమా కావటంతో ఈ సినిమాకి కాజల్ కరెక్ట్ గా సూట్ అవుతుందని ప్రభాస్ కాజల్ ని రిఫర్ చేయటం వల్ల డార్లింగ్ సినిమాలో ప్రభాస్ సరసన నటించే అవకాశాన్ని సమంత కోల్పోయింది.
ఇక ఇప్పటివరకు కూడా సమంత ప్రభాస్ కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాకపోవడం గమనార్హం. వీరిద్దరూ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా గుర్తింపు పొందారు.
అయినప్పటికీ వీరిద్దరూ కలిసి నటించకపోవటానికి గల కారణం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియటం లేదు.
బాహుబలి సినిమా ద్వారా వన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో మాత్రమే నటిస్తూ బిజీగా ఉన్నాడు.
ఇటీవల విడుదలైన రాదే శ్యామ్ సినిమా నిరాశపరిచింది. ఇక ప్రస్తుతం సలార్ , ప్రాజెక్ట్ కె సినిమాల షూటింగ్స్ లో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఇక సమంత కూడా తాజాగా అనారోగ్యం నుండి కోలుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల యశోద సినిమా ద్వారా హిట్ అందుకున్న సమంత తొందరలోనే శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో కూడా నటిస్తోంది. ఇలా సౌత్ సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ సమంత ప్రస్తుతం బిజీగా ఉంది.